NEWS

అట్టహాసంగా 12వ వార్డు టీడీపీ అభ్యర్థి షేక్ అయేషా రఫీ నామినేషన్

నరసరావుపేట:నరసరావుపేట పురపాలక సంఘ ఎన్నికల సందర్భముగా 12వ వార్డు కూటమి టీడీపీ అభ్యర్థి షేక్ అయేషా రఫీ అట్టహాసంగా నామినేషన్ ఆదివారం దాఖలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల సహకారంతో ఆమె ఈ నామినేషన్ను అధికారికంగా సమర్పించారు. నాయకుల మద్దతుతో కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
భారీ మెజారిటీతో గెలుపుపై ధీమా:
తనపై నమ్మకం ఉంచి అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, రానున్న ఎన్నికల్లో 12వ వార్డులో భారీ మెజారిటీతో గెలుస్తానని
ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Jani Mastan Shaik

About Author