ANDHRA PRADESH NEWS

ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆటోనామస్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ

నరసరావుపేట:నరసరావుపేట సమీపంలోని కేసానపల్లిలో ఉన్న ప్రముఖ ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ బీ-టెక్ 1వ , 2వ సెమిస్టర్ ఆటోనామస్ పరీక్షల ఫలితాలు ఘనంగా వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో వివిధ బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. నాగమల్లేశ్వర రావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వివిధ విభాగాల వారీగా సాధించిన ఫలితాలను పరిశీలిస్తే, ఏఐ & మిషన్ లెర్నింగ్ విభాగంలో అశ్నలదేవి స్వప్న 86శాతం మార్కులతో కళాశాల ఓవరాల్ టాపర్‌గా నిలిచారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో షేక్ సమీనా బేగం 85శాతం, ఏఐ అండ్ డేటా సైన్స్ విభాగంలో నల్లగొండ లక్ష్మి తిరుపతమ్మ 84శాతం, కంప్యూటర్ సైన్స్ విభాగంలో షేక్ ఇర్ఫానా 84శాతం, ఈసీఈ విభాగంలో షేక్ వైద్యుడు జిలానీ 82శాతం, ఈఈఈ విభాగంలో జె. కీర్తన 81శాతం మార్కులతో ఆయా విభాగాల్లో టాపర్లుగా విజయం సాధించారు. విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదవడం వల్లే ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రిన్సిపాల్ కొనియాడారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి అధ్యాపకులు నిరంతరం కృషి చేస్తున్నారని, విద్యార్థులు చదువుతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ షేక్ కరీమ్ మొహిద్దీన్ సూచించారు. నాణ్యమైన విద్యను అందించడమే యాజమాన్య లక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షేక్ నజీమా పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ షేక్ మీరావలి మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులలో రెండు సెమిస్టర్లలో కాలేజీ టాపర్‌గా నిలిచిన వారికి ‘షేక్ దాదా సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ప్రత్యేక మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ఈ సందర్భంగా ప్రకటన చేశారు. విద్యార్థులు ఇదే పట్టుదలతో తదుపరి సెమిస్టర్లలోనూ ఉన్నత విజయాలు సాధించాలని యాజమాన్యం, అధ్యాపక బృందం ఆకాంక్షించారు.

Jani Mastan Shaik

About Author