ANDHRA PRADESH LOCAL NEWS POLITICS STATE

నరసరావుపేట మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు.. అధికారిక షెడ్యూల్ విడుదల

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను జిల్లా యంత్రాంగం అధికారికంగా ఖరారు చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి కృత్తికా శుక్లా ఈ మేరకు మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 48 వార్డులు ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు.
వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలు:
షెడ్యూల్డ్ తెగలు (STs): మున్సిపాలిటీ పరిధిలో ఎస్టీలకు మొత్తం 1 వార్డు కేటాయించారు . (జనరల్: వార్డు నెం. 01)
.షెడ్యూల్డ్ కులాలు (SCs): ఎస్సీల కోసం మొత్తం 4 వార్డులు రిజర్వ్ చేశారు . ఇందులో మహిళలకు 2 వార్డులు (వార్డు నెం. 06, 21), జనరల్ కేటగిరీ కింద 2 వార్డులు (వార్డు నెం. 07, 19) కేటాయించారు.
వెనుకబడిన తరగతులు (BCs): బీసీలకు మొత్తం 19 వార్డులు కేటాయించారు. ఇందులో భాగంగా మహిళలకు 10 వార్డులు (వార్డు నెం. 08, 09, 10, 12, 22, 26, 27, 38, 48), జనరల్ కేటగిరీ కింద 9 వార్డులు (వార్డు నెం. 02, 04, 05, 11, 13, 24, 37, 42, 43, 45) కేటాయించినట్లు
షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
మహిళలు (జనరల్ – Women General): మహిళా జనరల్ కోటా కింద మొత్తం 13 వార్డులు కేటాయించారు. (వార్డు నెం. 03, 14, 16, 18, 25, 28, 29, 30, 31, 34, 36, 39, 46).
అన్‌రిజర్వ్‌డ్ (Unreserved): ఎలాంటి రిజర్వేషన్లు లేని జనరల్ (అన్‌రిజర్వ్‌డ్) స్థానాలు మొత్తం 11 వార్డులుగా ఉన్నాయి. (వార్డు నెం. 15, 17, 20, 23, 32, 33, 35, 40, 41, 44, 47).
స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తుండగా, తాజా రిజర్వేషన్ల ప్రకటనతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Jani Mastan Shaik

About Author