ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ విత్య రామరాజ్ చారిత్రక ప్రదర్శనతో మెరిసింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అద్భుత వేగంతో దూసుకెళ్లిన ఆమె కాంస్య పతకాన్ని ముద్దాడటంతో పాటు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. గతంలో పీటీ ఉష పేరిట ఉన్న 55.42 సెకన్ల రికార్డును అధిగమిస్తూ.. విత్య కేవలం 54.75 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో యూఏఈకి చెందిన మరియం కరీమ్ స్వర్ణ పతకం సాధించగా, కజకిస్థాన్ అథ్లెట్ అదెలినా జెమ్స్ రజత పతకం కైవసం చేసుకుంది.