Wednesday, 28 October 2026
NEWS SPORTS

ఇషా సింగ్‌కు రజతం.. పింకీకి కాంస్యం

ఆసియా క్రీడల్లో తొమ్మిదో రోజు భారత్‌ పతకాల వేటను ఘనంగా కొనసాగించింది. షూటింగ్‌లో రజతం, కురాష్‌లో కాంస్య పతకాలు లభించగా, స్టార్ బాక్సర్ లవ్లీనా సెమీస్‌కు చేరి మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. షూటింగ్‌ మహిళల 25 మీటర్ల వ్యక్తిగత విభాగంలో భారత యువ షూటర్ ఇషా సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్లో చైనాకు చెందిన జియో జియారుక్సాన్‌తో గోల్డ్ మెడల్ కోసం చివరి వరకూ హోరాహోరీగా తలపడింది. ఇద్దరి స్కోర్లు సమం కావడంతో విజేతను తేల్చేందుకు నిర్వహించిన షూట్ ఆఫ్‌లో చైనా క్రీడాకారిణి పైచేయి సాధించి స్వర్ణం దక్కించుకోగా, ఇషా సింగ్‌కు రజత పతకం దక్కింది.కురాష్‌ క్రీడలో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సెమీఫైనల్ పోరులో కొరియాకు చెందిన మో సుమిన్ చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైనప్పటికీ, 2018 ఆసియా క్రీడల ఫలితాన్ని పునరావృతం చేస్తూ మరోసారి కాంస్యాన్ని ముద్దాడింది.

Jani Mastan Shaik

About Author

You may also like