ANDHRA PRADESH LOCAL NEWS

పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే పరమావధి

. గోపిరెడ్డి ఆశీస్సులతో బరిలోకి మాజీ కౌన్సిలర్ మస్తాన్ తనయుడు
. “ఖాజా గెలుపు.. వార్డు ప్రగతికి మలుపు” నినాదంతో ముమ్మర ప్రచారం
. అధికారమున్నా లేకున్నా ఆత్మీయులుగానే అడుగులు
. గతంలో చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటేయాలని అభ్యర్థన


నరసరావుపేట: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల సమరంలో భాగంగా 11వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ఖాజా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇస్లాంపేటకు చెందిన మాజీ కౌన్సిలర్ షేక్ మస్తాన్ ప్రథమ కుమారుడైన ఖాజా, స్థానికంగా అందరికీ సుపరిచితులు. పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో ఆయన బరిలో నిలిచారు. “ఖాజా గెలుపు.. వార్డు ప్రగతికి మలుపు” అనే నినాదంతో పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ప్రతి వీధిలోనూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి షేక్ ఖాజావలి మాస్టర్‌కు, 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తనకు ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
గత అభివృద్ధిని గుర్తుచేస్తూ.. గడపగడపకూ సంక్షేమ సందేశం:
ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి గడపనూ తడుతున్న ఖాజా మాట్లాడుతూ.. తన తండ్రి షేక్ మస్తాన్ కౌన్సిలర్‌గా ఉన్న సమయంలో బురదమయంగా ఉన్న వెంగళరెడ్డి కాలనీలో సిమెంట్ రోడ్లు వేయించారని, డ్రైనేజీ కాలువలు, ఇతర మౌలిక వసతులతో పాటు అర్హులందరికీ పింఛన్లు, పక్కా ఇళ్లు మంజూరు చేయించి వార్డును ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారంతో జగనన్న కాలనీలో 500 మందికి ఇళ్ల పట్టాలు, రూ.కోటి నిధులతో సీసీ రోడ్లు, మౌలిక వసతుల కల్పన జరిగిందన్నారు. అలాగే 200 మంది మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున జగనన్న చేయూత, 300 మందికి కొత్త పెన్షన్లు, కులవృత్తుల వారికి జగనన్న చేదోడు వంటి పథకాల ద్వారా వార్డును అభివృద్ధి పథంలో నడిపించామని వివరించారు.
మా కుటుంబం ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటుంది.. ఒక్క అవకాశం ఇవ్వండి:
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్న ఖాజాకు మహిళలు, వృద్ధులు హారతులు పడుతూ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ.. “మా కుటుంబం పదవులు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సేవ చేస్తోంది. వార్డులోని తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, అంతర్గత రహదారుల వంటి మౌలిక సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారంతో 11వ వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాను. నన్ను ఒక్కసారి కౌన్సిలర్‌గా గెలిపించి ఆశీర్వదించండి,” అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Jani Mastan Shaik

About Author