. కమలం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి
. వార్డులో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని హామీ
నరసరావుపేట:
నరసరావుపేట పట్టణంలోని 39వ వార్డు ఎన్డీయే ఉమ్మడి కూటమి (బీజేపీ) అభ్యర్థి పెనుగొండ లక్ష్మీ సుజాత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పట్టణ ప్రముఖ రైస్ మిల్ వ్యాపారి వూరా భాస్కరరావు సతీమణి అయిన ఆమె, వార్డులోని మహిళలు, యువత, స్థానిక ప్రజలతో కలిసి విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్ల ఆదరణ పొందుతున్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: లక్ష్మీ సుజాత
ఈ సందర్భంగా లక్ష్మీ సుజాత మాట్లాడుతూ.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ‘కమలం’ గుర్తుపై పోటీ చేస్తున్న తనను వార్డు ప్రజలందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల తర్వాత వార్డు ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా 39వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో మెరుగుపరిచి, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



