ANDHRA PRADESH LOCAL NEWS

ప్రచారంలో దూసుకుపోతున్న అయేషా రఫీ

. “అయేషా రఫీ గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు” అంటూ విస్తృత ప్రచారం
నరసరావుపేట:
మున్సిపల్ ఎన్నికల సమరంలో భాగంగా నరసరావుపేట 12వ వార్డు టీడీపీ అభ్యర్థిని అయేషా రఫీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు ఆశీస్సులతో, వార్డు పెద్దల సహకారంతో బరిలో నిలిచిన ఆమె.. పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి ప్రతి వీధిలోనూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. “అయేషా రఫీ గెలుపు.. వార్డు అభివృద్ధికి మలుపు” అనే నినాదంతో సాగుతున్న ఆమె ప్రచారానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రూపేష్ గుప్తాను, కౌన్సిలర్ అభ్యర్థిగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరుతున్నారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి రూపేష్ గుప్తా ఛైర్మన్ కావడం ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
గడపగడపకూ సంక్షేమ పథకాలు.. మౌలిక సమస్యల పరిష్కారమే లక్ష్యం:
ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి గడపనూ తడుతున్న అయేషా రఫీ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుతున్న ఆర్థిక భరోసాను గుర్తు చేస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతుండగా, మహిళలు, వృద్ధులు ఆమెకు సాదర స్వాగతం పలుకుతున్నారు. వార్డులోని తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, అంతర్గత రహదారులు వంటి మౌలిక సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సహకారంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అయేషా రఫీ ఓటర్లకు భరోసా ఇచ్చారు.

Jani Mastan Shaik

About Author