Wednesday, 28 October 2026
NATIONAL NEWS

ఎంబీబీఎస్ లోకల్ కోటాపై సుప్రీం స్పష్టత

తెలంగాణలో ఎంబీబీఎస్ స్థానిక రిజర్వేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో లోకల్ కోటా వర్తించాలంటే విద్యార్థులు వరుసగా నాలుగేళ్ల పాటు విద్యాభ్యాసం చేసి ఉండాలన్న నిబంధన తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్థానిక రిజర్వేషన్లు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే అమలు కావాలని పేర్కొంటూ, గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కోసం నాలుగేళ్ల విద్యాభ్యాసాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం కొట్టివేసింది. ఈ నిబంధన ఏకపక్షంగా ఉందన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన విద్యార్థులకే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.

Jani Mastan Shaik

About Author