ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ కోసం సిద్ధమవుతూ, వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఒక్కో ఆఫర్‌ను రివీల్ చేస్తోంది. అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా సేల్‌లో విక్రయించనున్న పలు ప్రముఖ స్మార్ట్ఫోన్లపై మోటోరొలా సంస్థ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మోటో ఎడ్జ్, జీ సిరీస్ మోడళ్లతో పాటు ఇటీవల విడుదలైన ఫ్లాగ్షిప్ ‘సిగ్నేచర్’ మోడల్‌పైనా ఈ తగ్గింపులు వర్తిస్తాయని తెలిపింది. కాగా ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్షిప్ ఉన్న కస్టమర్లకు ఒక రోజు ముందుగానే, అంటే అక్టోబర్ 8 నుంచే ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.
వివిధ వేరియంట్లలో లభించే మోటో ఫోన్ల ఆఫర్ల వివరాలను పరిశీలిస్తే.. మోటోరొలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (8జీబి +128జీబి) వేరియంట్ ప్రస్తుతం రూ.30,999 ఉండగా సేల్‌లో రూ.29,999కే లభించనుంది. మోటోరొలా ఎడ్జ్ 70 ప్రో (8జీబి+256జీబి) వేరియంట్‌పై రూ.3,000 తగ్గింపుతో రూ.36,999కు, ఎడ్జ్ 70 ప్రో+ (12జీబి+256జీబి) వేరియంట్ ప్రస్తుతం రూ.47,999 ఉండగా సేల్‌లో రూ.44,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే మోటో జీ37 పవర్‌పై రూ.1,250 డిస్కౌంట్‌తో బేస్ వేరియంట్ రూ.16,999కు లభిస్తుండగా, మోటో జీ06 పవర్ రూ.13,999కు, మోటో ఎడ్జ్ 70 మ్యాక్స్ రూ.51,999కు అందుబాటులో ఉండనున్నాయి. మోటోరొలా ఈ ఏడాది లాంచ్ చేసిన ప్రీమియం ఫోన్ ‘సిగ్నేచర్’ (12జీబి+256జీబి) వేరియంట్ ప్రస్తుత ధర రూ.59,999 కాగా, సేల్‌లో రూ.57,499లకే కొనుగోలు చేయవచ్చు.
Previous Article
ఎంబీబీఎస్ లోకల్ కోటాపై సుప్రీం స్పష్టత
Next Article
రూ.20 లకే రూ.2 లక్షల ప్రమాద బీమా
Jani Mastan Shaik
About Author
You may also like
TECHNOLOGY
Every geek wants to know everything about plane engines.
- BY admin
- October 6, 2022
- 0 Comments

