ఆత్మనిర్భర్ భారత్‌కు అల్యూమినియం రంగం కీలకం
భారత పారిశ్రామిక రూపాంతరానికి అల్యూమినియం రంగం అత్యంత కీలక చోదకశక్తిగా ఎదుగుతోందని కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ , కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘అల్యూమినియం రోడ్‌షో’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.రక్షణ రంగం, రైల్వేలు, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు , ఏరోస్పేస్‌తో పాటు నూతన సాంకేతిక రంగాలలో అల్యూమినియం వినియోగం విస్తృతంగా పెరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఒకప్పుడు సాంకేతికతను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, నేడు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘మేడ్ ఇన్ ఇండియా’ మెట్రో కోచ్‌లను జపాన్‌కు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం దేశ తయారీ రంగ సత్తాకు నిదర్శనమన్నారు. దేశీయంగా అల్యూమినియం ఉత్పత్తిని పెంచడం, వ్యాల్యూ అడిషన్‌ను ప్రోత్సహించడం ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో పాటు ‘నెట్ జీరో 2070’ దిశగా వేగంగా అడుగులు వేయవచ్చని చెప్పారు.పశ్చిమ బెంగాల్‌కు ఉన్న చారిత్రక పారిశ్రామిక వైభవాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, పెట్టుబడులు, ఉపాధి కల్పనలో రాష్ట్ర సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వెలికితీయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బెంగాల్‌లో రూ.1.47 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రణాళికలో ఉండగా, ఇప్పటికే రూ.79,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఆధునిక రవాణా, కనెక్టివిటీతో బెంగాల్ ఒక సమగ్ర సముద్ర కారిడార్‌గా ఎదుగుతోందని, ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో పశ్చిమ బెంగాల్ పారిశ్రామికంగా ముందుండి కీలక పాత్ర పోషించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు
Previous Article
భూకక్ష్యలోకి దూసుకెళ్లిన స్టార్‌షిప్
Next Article
ధరల పెరుగుదలపై స్పందించండి మోదీజీ
Jani Mastan Shaik
About Author
You may also like
LOCAL
NATIONAL
Unleash Your Inner Gamer: Top Titles to Dive Into
- BY admin
- November 1, 2023
- 0 Comments

