Thursday, 29 October 2026
TECHNOLOGY

మోటోరొలా స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్’ కోసం సిద్ధమవుతూ, వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఒక్కో ఆఫర్‌ను రివీల్ చేస్తోంది. అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా సేల్‌లో విక్రయించనున్న పలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై మోటోరొలా సంస్థ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మోటో ఎడ్జ్, జీ సిరీస్‌ మోడళ్లతో పాటు ఇటీవల విడుదలైన ఫ్లాగ్‌షిప్ ‘సిగ్నేచర్’ మోడల్‌పైనా ఈ తగ్గింపులు వర్తిస్తాయని తెలిపింది. కాగా ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్లకు ఒక రోజు ముందుగానే, అంటే అక్టోబర్ 8 నుంచే ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.
వివిధ వేరియంట్లలో లభించే మోటో ఫోన్ల ఆఫర్ల వివరాలను పరిశీలిస్తే.. మోటోరొలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (8జీబి +128జీబి) వేరియంట్‌ ప్రస్తుతం రూ.30,999 ఉండగా సేల్‌లో రూ.29,999కే లభించనుంది. మోటోరొలా ఎడ్జ్ 70 ప్రో (8జీబి+256జీబి) వేరియంట్‌పై రూ.3,000 తగ్గింపుతో రూ.36,999కు, ఎడ్జ్ 70 ప్రో+ (12జీబి+256జీబి) వేరియంట్‌ ప్రస్తుతం రూ.47,999 ఉండగా సేల్‌లో రూ.44,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే మోటో జీ37 పవర్‌పై రూ.1,250 డిస్కౌంట్‌తో బేస్ వేరియంట్ రూ.16,999కు లభిస్తుండగా, మోటో జీ06 పవర్ రూ.13,999కు, మోటో ఎడ్జ్ 70 మ్యాక్స్ రూ.51,999కు అందుబాటులో ఉండనున్నాయి. మోటోరొలా ఈ ఏడాది లాంచ్ చేసిన ప్రీమియం ఫోన్ ‘సిగ్నేచర్’ (12జీబి+256జీబి) వేరియంట్‌ ప్రస్తుత ధర రూ.59,999 కాగా, సేల్‌లో రూ.57,499లకే కొనుగోలు చేయవచ్చు.

Jani Mastan Shaik

About Author